‘వారసుడు’ చూడమని పిల్లలు పెద్దలకు చెబుతున్నారు : దర్శకుడు వంశీ పైడిపల్లి

'వారసుడు' చూడమని పిల్లలు పెద్దలకు చెబుతున్నారు : దర్శకుడు వంశీ పైడిపల్లి

దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే ‘మాస్టర్’ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను నా జీవితంలో అతిపెద్ద రోలర్ కోస్టర్ ను అనుభవించానని చెప్పాలి. వారసుడు రిజల్ట్ తో చాల సంతోషం గా ఉన్నాను. నేను తమిళం లో తీసిన మొదటి సినిమా…