సెన్సార్ పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్దమైన ‘ది సస్పెక్ట్ ‘

"The Suspect" Set for Worldwide Release on March 21st After Censor Clearance
Spread the love

ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన మరియు ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు . ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంది అన్నారు నిర్మాత కిరణ్ కుమార్. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల కానుంది.

Related posts

Leave a Comment