గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లిమ్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… ‘లవ్ రెడ్డి’ గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. నాకు కూడా ఒక లవ్ స్టొరీ చెయ్యాలని అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తుంటే, అందరూ యంగ్ టీమ్ కలిసి చేసున్న ఈ సినిమా…