గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి, మాస్ మొగుడు పాటలు ష్మాసింగ్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు థమన్ పంచుకున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలివి… ‘వీరసింహారెడ్డి’తో 2023ని బ్లాక్ బస్టర్ గా స్టార్ చేయబోతున్నారు.. ఎలా అనిపిస్తోంది ? -‘వీరసింహారెడ్డి’ కోసం…
