మార్చి 3 న ‘బిగ్ స్నేక్ కింగ్’

మార్చి 3 న 'బిగ్ స్నేక్ కింగ్'

ఏలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వస్తున్న సినిమా బిగ్ స్నేక్ కింగ్. ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఏలూరు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 3న అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. తెలుగులో నేను రిలీజ్ చేస్తున్నాను. కథ విషయానికి వస్తే.. చైనా లోని ఒక గ్రామానికి చెందిన లీ.. కొంతమంది గ్రామస్థులను అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకు తీసుకెళ్తాడు. అయితే వారి కారణంగా వందేళ్లు గా నిద్రపోతున్న అతి పెద్ద పాము నిద్ర లేస్తుంది. దీని నుండీ తప్పించుకునే సమయంలో లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత దానిని తరిమి కొట్టడానికి గ్రామస్థులు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. మహారాజు కుమారుడు చింగ్ చాంగ్ వచ్చి…