యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ హారర్ చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. .ఈ సినిమాను కాశ్మీర్, హైదరాబాద్ పలు చోట్ల షూటింగ్ జరుపు కున్నాము. నిన్నే ఫస్ట్ కాపీ చూశాము.మంచి అద్భుతమైన కంటెంట్ వచ్చింది. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ కి 76 సూపర్ హిట్స్ ఇచ్చాడు. అలాంటి తన దర్శకత్వంలో వస్తున్న ‘ఊ అంటావా మావా…
