‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి

'బెదురులంక 2012' షూటింగ్ పూర్తి

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ అని ఓ వీడియో విడుదల చేశారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ‘బెదురులంక 2012’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012’ వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు. విశాలమైన గోదావరి… తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు… మధ్యలో మనుషులు… బండి మీద దూసుకు వెళుతున్న…