బహు భాషా చిత్రం “భారతీయన్స్” హీరో “నీరోజ్ పుచ్చా”కు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ “ఎ.బి.డివిలియర్స్” ప్రశంసలు!!

Renowned Cricketer AB De villiers appreciate Bharateeyans Hero Nerroze Putcha!!

తెలుగు – హిందీ భాషల్లో నేరుగా తెరకెక్కి… ప్రధాన భారతీయ భాషలన్నిటిలో అనువాదం కానున్న బహు భాషా దేశభక్తి చిత్రం “భారతీయన్స్” టీజర్ ను ప్రపంచ ప్రఖ్యాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ ప్రశంసించారు. ప్రస్తుతం ఈయన ఐపిఎల్ – ఆర్.సి.బి టీమ్ లో ఉన్నారు. ఈ చిత్ర కథానాయకుల్లో ఒకరిగా పరిచయమవుతున్న “నీరోజ్ పుచ్చా”కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు. “భారతీయన్స్” చిత్రంతో తనను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత శంకర్ నాయుడు, దర్శకుడు దీన్ రాజ్ లకు జీవితాంతం రుణ…