నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ఉదయం 10.01 గంటలకు పాన్ ఇండియా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘హంట్’ సినిమాలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అందులో మెమరీ లాస్‌కు ముందు కలిసిన వ్యక్తులు, జరిగిన ఘటనలు అర్జున్‌కు గుర్తు లేవు కానీ… పోలీస్ ట్రైనింగ్, భాషలు,…
