పోటీతత్త్వం జమునకే చెల్లింది : పరుచూరి గోపాలకృష్ణ

పోటీతత్త్వం జమునకే చెల్లింది : పరుచూరి గోపాలకృష్ణ

ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన జమున సంతాప అలనాటి అందాల నటి ప్రజానాట్యమండలి బిడ్డ జమున సంతాప సభ సోమవారం ఉదయం నిర్మాతల మండలి హలులో జరిగింది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజా కళాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ప్రజానాట్యమండలి, చిన్న వయసులోనే బుర్రకధ నాజర్ తదితరులు జమున ని నాటకాలలో నటింపజేసిన పిదప డాక్టర్ గరికపాటి రాజారావు దర్శకత్వంలో నిర్మించిన పుట్టిల్లు చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయం చేయటం ద్వారా ఆవిడ ఉన్నతికి అండగా నిలబడటం, తదుపరి జమున కూడా ప్రజానాట్యమండలి అనేక సభలకు హాజరయి నూతన కళాకారులను ఉత్సాహ పరచటం జరిగింది. ఆవిడ మరణం ప్రజానాట్యమండలికి తీవ్రమైన లోటు అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను ఇష్టపడే ఇద్దరు అగ్ర నటులతో…