ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్‌గా ‘పులి మేక’ యాడ్ అయ్యింది. ఈ ఒరిజినల్‌ను జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించాయి. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ జంటగా నటించిన ఈ సిరీస్‌లో సిరి హన్మంత్. రాజా, సుమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్బ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘ఈ పులి మేక…