సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా ‘అమ్మదొంగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ‘పులి’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘The 19th century’ అన్నది ఉపశీర్షిక. ఈ రోజు పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సిజు విల్సన్, హీరోయిన్ కాయాదు లోహర్ , దర్శకుడు వినయన్, నిర్మాత సుధాకర్ బాబు, ప్రసాద్ నాయక్,…