డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. మంగళవారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మ క్షేత్రం సినిమాలో ఎవర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్. ధర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాటను ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు.…
