జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా.. సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి మరియు డైరెక్టర్ కి , మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను. హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా…
