జూలై 7న UFO మూవీస్ ద్వారా ‘ఓసాథియా’ విడుదల

జూలై 7న UFO మూవీస్ ద్వారా 'ఓసాథియా' విడుదల

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థ ఏ.పి, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.లక్ష్మణ్‌ అని చెప్పారు. లక్ష్మణ్ గారు ‘ఓ సాథియా’…