సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శరణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’. శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన సినిమా పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్, సినిమా టీజర్లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ…
