జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్ మరియు డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ మరియు జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనస కి అందచేశారు. పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “భారత్ మరియు జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మరియు కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుండి విపరీతమైన ఆసక్తిని…
