నిర్మాత ఎస్.కే.ఎన్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా, ఆర్థిక సాయం చేయాలన్నా కూడా ఎస్.కే.ఎన్ ముందుంటారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుతూ మంచి చిత్రాలు తీస్తోన్న ఎస్.కే.ఎన్ ఇలా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. స్టేజ్ ఎక్కితే ప్రాసలు, పంచ్‌లతో ఆడియెన్స్‌ను అలరించే ఎస్.కే.ఎన్.. ఇలా తనకు వీలైనంతలో సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన తన తోటి స్నేహితుడి బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరాళం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చలించిన ఎస్.కే.ఎన్ లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతే కాకుండా దాతలైవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. ‘చిన్న పిల్లలు దేవుడితో సమానం.. ఈ బిడ్డ…
