చక్కటి ప్లానింగ్‌తో మణిశంకర్ సినిమాను నిర్మించారు : సంజన గల్రానీ

చక్కటి ప్లానింగ్‌తో మణిశంకర్ సినిమాను నిర్మించారు : సంజన గల్రానీ

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. విడుదల తేదీపై దర్శక నిర్మాతలు ప్రకటన చేశారు. ఈ ఈవెంట్‌లో.. సంగీత దర్శకుడు ఎం ఎల్ రాజా మాట్లాడుతూ.. ‘సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది.…