ఘనంగా “ట్రిబ్యూట్ టు ఇళయరాజా” ఈవెంట్

Tribute To Ilayaraaja event gets rousing response

హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు “ట్రిబ్యూట్ టు ఇళయరాజా ” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆదివారం జరగనున్న ఇళయరాజా లైవ్ కన్సర్ట్ నేపథ్యంలో శనివారం “ట్రిబ్యూట్ టు ఇళయరాజా” ఈవెంట్ ను సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెడ్ కార్పేట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. ఎన్నో విజయవంతమైన ఈవెంట్స్ చేసిన హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ జరిగింది. ఇళయరాజ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. సినీరంగ ప్రముఖులు రాజా సర్ కి అభినందన పేరుతో సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు,…