ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్ జంటగా నటించిన ‘శశివదనే’ చిత్రం నుంచి ఫిబ్రవరి 1న టైటిల్ సాంగ్ విడుదల – ఆకట్టుకుంటోన్న ప్రోమో

Gear up for a melody from Rakshit Atluri - Komalee Prasad's 'Sasivadane' on February 1 Title song 'Sasivadane' gets a soothing promo

యువ కథానాయకుడు ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే’. గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. గౌరి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.ఎస్.క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. రక్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్‌, క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం నిర్మాత అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోను గమనిస్తే కోమలి ప్రసాద్ దేవుడికి పూజ చేసి తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రేమికుడు ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే…