ఆనంద్ దేవరకొండ హీరోగా గతంలో పుష్పక విమానం అనే ఫుల్ లెంగ్త్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ తీసి ఆకట్టుకున్న దర్శకుడు దామోదర. మొదటి సినిమాతోనే విషయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టేకింగ్ తో పాటు మేకింగ్ తోనూ మెప్పించాడు. పుష్పక విమానం వంటి మినిమం బడ్జెట్ మూవీతోనే మాగ్జిమం ఎంటర్టైన్ చేసిన దామోదర ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కన్యాకుమారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. పుష్పక విమానంలో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ,…
