ఏప్రిల్ 28న థియేట‌ర్స్‌లో పొన్నియిన్ సెల్వ‌న్ 2ను ఎంజాయ్ చేస్తారు : ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం

ఏప్రిల్ 28న థియేట‌ర్స్‌లో పొన్నియిన్ సెల్వ‌న్ 2ను ఎంజాయ్ చేస్తారు : ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గ‌త ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మ‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.ఈ నేప‌థ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో…