ఖుషీ..ఖుషీగా మెగా ఫ్యాన్స్ సంబరాలు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దాంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇద్దరూ ఎంతో క్షేమంగా వున్నారని, మెగా కుటుంబంలో అందరూ రామ్ చరణ్ దంపతులకి సంతోషంగా విషెస్ చెబుతున్నారు. పవర్ కపుల్ అని పిలవబడుతున్న రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టడంతో ఇన్నాళ్లూ ఎదురుచూస్తోన్న మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ, నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చిందని…
