కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే అరి సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారితీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాల్సిన పనిలేదు.. ఒక్క మెతుకు పట్టుకుంటే పదును తెలిసిపోతుంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘అరి’ చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు యువ దర్శకుడు జయ శంకర్. విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటుంది ఈ చిత్రం. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో మంగ్లీ పాడిన…
