బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడీ సినిమా ఆడియెన్స్‌కు మరింత చేరువ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఆహాల్లో మహా శివ రాత్రి సందర్భంగా స్ట్రీమింగ్ అవుతుంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్). తండ్రి (దేవీ ప్రసాద్) ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. తను ఏది అడిగినా కొనివ్వలేడు. దీంతో లక్ష్మణ్‌లో తెలియని అసంతృప్తి ఉంటుంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో శ్రియ (మోక్ష)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి లక్ష్మణ్…
