మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సహా మెగాభిమానులు ఈ విషయంతో సంతోషంగా ఉన్నారు. ఈ విషయం గురించి అపోలో డాక్టర్ సుమనా మనోహర్ మాట్లాడుతూ ‘‘ఈరోజు తెల్లవారుజామున ఉపాసనకు పాప పుట్టింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వీలైనంత త్వరగా వారు ఇంటికి కూడా వెళతారు. డాక్టర్ రూమా సిన్హాగారు ఆమెను రెగ్యులర్‌గా పరీక్షించి జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. అలాగే డాక్టర్ లతా కంచి పార్థసారథి న్యూట్రిషన్ సలహాలిస్తూ వచ్చారు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార విషయంలో, ఫిట్‌నెస్ విషయంలో ఉపాసన ఎంతో కేర్ తీసుకున్నారు. ఆమె అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చారు కాబట్టే సుఖ ప్రసవం జరిగింది’’…
