ZEE5, ZEE తెలుగులో మార్చి 1న ప్రీమియర్‌గా రాబోతోన్న అనిల్ రావిపూడి, వెంకటేష్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’

Anil Ravipudi and Venkatesh's recent blockbuster 'Sankranti Aaynaam' will premiere on ZEE5, ZEE Telugu on March 1.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతూన్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా ZEE5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ ..‘ZEE5, ZEE తెలుగు రెండింటిలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల కంటెంట్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తుంటారు. ఈ చిత్రం…