యష్ రాజ్ ఫిల్మ్స్ ‘సైయారా’ టీజర్‌ విడుదల

Yash Raj Films' 'Syeyaaraa' teaser released

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. వై.ఆర్.ఎఫ్ బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సైయారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ క్రమంలో అహాన్ పాండే, అనీత్ జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ ‘సైయారా’ టీజర్‌ను రిలీజ్ చేశారు. సైయారా చిత్రాన్ని కంపెనీ సీఈఓ అక్షయ్ విధాని నిర్మించారు. ఇక ఈ మూవీ టీజర్‌ను గమనిస్తే.. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథను అంతే…