వాహ్.. ‘దేవర’లోని చుట్టమల్లె పాటకు వందమిలియన్‌ వ్యూస్!

Wow.. One hundred million views for Chuthamalle song in 'Devara'!

పాన్‌ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ‘దేవర’. జూనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌లో రోల్‌ పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దేవర’ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా చుట్టమ్లలె మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారని తెలిసిందే. తారక్‌, జాన్వీకపూర్‌ కెమిస్ట్రీలో వచ్చే ఈ డ్యుయెట్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని విజువల్స్‌ చెప్పకనే చెబుతున్నాయి. ఈ సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్‌ చేసి నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ‘చుట్టమ్లలె..’ పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఈ సాంగ్‌ నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్…