టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రూట్ మార్చిన సిద్ధుకు.. ‘డీజే టిల్లు’ మూవీతో బ్రేక్ లభించింది. దీంతో యూత్‌లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ పేరుతో సీక్వెల్ చేస్తూ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మొదటి పార్ట్ లో హీరోయిన్ ని చివరిలో హీరో ట్విస్ట్ ఇస్తాడు. మొదట హీరోయిన్ చేసిన నేరం, హీరో మీద పడేలా చేస్తుంది. కానీ, హీరో చాలా తెలివిగా దాని నుంచి తప్పించుకొని, చివర్లో ఆమె…