‘జైహనుమాన్‌’ ఆంజనేయుడుగా రానా!?

Will 'Jaihanuman' come as Anjaneyudu!?

టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్‌’ భారీ విజయంతో సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ ప్రకటించారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్‌ ఉంటుందని ప్రశాంత్‌ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హనుమాన్‌’కు సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్‌ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్‌ పార్ట్‌ ‘జై హనుమాన్‌’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఇతడే…