‘గుంటూరు కారం’ పరిస్థితి ఏంటంటే..?!

What is the condition of 'Guntur Karam'?!

తెలుగు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ కు సంగీతాన్ని అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన బిగ్ స్టార్స్ సినిమాలకు థియేటర్లు దద్దరిల్లేలా సంగీతం అందిస్తున్నారు. బడా స్టార్స్ క్రేజ్ కు తగ్గట్టుగా మోతమోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సంగీతాన్ని అందిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి తెలిసింది. ఆ మధ్య థమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు షికారు చేశాయి. వీటికి ఆయన తన తాజా ఇంటర్వ్యూల్లో స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది…