సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?.. నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా : ద‌ర్శ‌క నిర్మాత మ‌హి వి.రాఘ‌వ్‌

What has the film industry done for Rayalaseema?.. I want to build a mini studio for the development of my area: Director-producer Mahi V. Raghav

‘‘నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఆశ లేక‌పోతే, నేను హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో క‌ట్టుకోవటానికి స్థ‌లం కావాల‌ని అడుగుతాను. కానీ వెనుక‌బ‌డిన ప్రాంతంగా చూసే మ‌ద‌న‌ప‌ల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను’’ అని అంటున్నారు దర్శక నిర్మాత మహి వి.రాఘవ్. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసిన దానికే మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్ర‌భుత్వం… మ‌హి వి.రాఘ‌వ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెక‌రాలు భూమి ఇచ్చిందంటూ ఓ వ‌ర్గానికి చెందిన మీడియాలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై మ‌హి.వి.రాఘ‌వ్ స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ .. ‘‘నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండ‌స్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాను. మూన్ వాట‌ర్ పిక్చర్స్, 3 ఆట‌మ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ…