‘సుందరం మాస్టారు’ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో…!?

What did the director want to say through 'Sundaram Masteru'...!?

ఏ సినిమాకయినా కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. అప్పుడు చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్‌’ అనే సినిమాతో కళ్యాణ్‌ సంతోష్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. సుందరం (హర్షవర్ధన్‌) ఒక ప్రభుత్వ కళాశాలలో సోషల్‌ టీచర్‌ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్‌)కి మిరియాలమెట్ట గ్రామం నుండి…