టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్‌కుమార్, ట్రైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో ’బడే మియా ఛోటే మియా’ అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని,…
