సినిమాల కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. మూవీ డిజిస్టర్‌పై రకుల్‌ భర్త జాకీ భగ్నాని ఆవేదన

We sold properties for movies.. Rakul's husband Jackie Bhagnani's concerns over movie debt
We sold properties for movies.. Rakul's husband Jackie Bhagnani's concerns over movie debt
Spread the love

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్‌ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్‌ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. అలానే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త అయిన జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్‌ అగ్ర నటులు అక్షయ్‌కుమార్‌, ట్రైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలలో ’బడే మియా ఛోటే మియా’ అనే భారీ బడ్జెట్‌ చిత్రం నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని జాకీ స్పష్టం చేశారు. ఇది నాకు జీవితంలో ముఖ్యమైన గుణపాఠం నేర్పింది. ఒక ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో నిర్మిస్తే సరిపోదని, మూవీ రిలీజ్‌ అయ్యాక అర్ధమైంది. మా కథతో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్‌ కాలేకపోయారనే దానిపై ఒక్కసారి విశ్లేషించుకోవాలి. ప్రేక్షకుల నిర్ణయం సరైనదే కావచ్చు, వారిని తప్పు పట్టకుండా దీనిని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు- జరగకుండా జాగ్రత్త పడాలి అని జాకీ అన్నారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్‌ గురించి మాట్లాడిన ఆయన మేము పెట్టిన పెట్టు-బడిలో 50 శాతం తక్కువే వసూళ్లు వచ్చాయి. ఈ విషయాలు చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాని, లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో చిత్రం తీసాం.కాని అనుకున్న లక్ష్‌యం చేరుకోలేకపోయాం అని జాకీ భగ్నానీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌గా ’బడే మియా ఛోటే మియా’ తెరకెక్కగా, ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మానుషి చిల్లర్‌, అలయ ఎఫ్‌, సోనాక్షి సిన్హా వంటి తారలు కీలక పాత్రలు పోషించారు.