‘వాల్తేరు వీరయ్య’ సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి

walteru veeraiah pressmeet

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్’ కూడా సంచలన విజయం…