నేచురల్ స్టార్ నానితో ఒకసారి పనిచేసిన ఎలాంటి డైరెక్టర్ అయినా అతనితో చాలా మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. ఇక స్టార్ డైరెక్టర్స్ అయితే నాని టాలెంట్ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటారు. నాని తన కెరీర్ లో కొత్త దర్శకులు, యువ దర్శకులతో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు కానీ స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయడానికి ఆసక్తి చూపించడు. కొత్త వాళ్లతోనే సూపర్ హిట్లు కొడుతూ తన కెరీర్ సాగిస్తున్నాడు నాని. అయితే అతడి కెరీర్ లో ‘ఈగ’ సినిమా చాలా స్పెషల్ స్థానంలో ఉంటుంది. 2012లో నాని హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కింది. ఆ సినిమా టైం లో నానికి నేచురల్ స్టార్ ట్యాగ్ లైన్ కూడా లేదు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలనే ఆలోచనతో నాని ఈగ సినిమా…