‘W/O అనిర్వేశ్’ మూవీ రివ్యూ : అలరించే ట్విస్టులు.. ఆకట్టుకునే కథనం…

'W/O Anirvesh' Movie Review: Entertaining twists.. captivating story...

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయి. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ ను దర్శకుడు గంగ సప్తశిఖర… వరుసగా తీయడం వెనుక ఉన్న విజయ రహస్యం ఇదే. గతంలో ‘ది డెవిల్స్ చైర్’తో ఆకట్టుకున్న అతడు ఇప్పుడు ‘W/o అనిర్వేశ్’ అంటూ మరో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ను అలరించడానికి ఈ వారం వచ్చారు. ఇందులో జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా నటించారు. అతనితో పాటు జెమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, నజియా ఖాన్,…