(టైటిల్: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్, నిర్మాత: దాసరి కిరణ్ కుమార్, రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…
