పీవీఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా రామ్ తేజ్, గరిమ జంటగా రూపొందుతోన్న నూతన చిత్రం ఈ రోజు ఫిలించాంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్ కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఆనంద్ రాజ్ ఓంకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథాంశం. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముహర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..“పీవీఆర్ ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు. దర్శకుడు అక్షయ్ కృష్ణకు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో…
