ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విడుదల చేసిన వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’ పోస్ట‌ర్!

VJ Sunny's 'Sound Party' poster released at the hands of MLC Kalvakuntla Kavita

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ…“సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి…