‘విశ్వం’ పెర్ఫెక్ట్ పండగ సినిమా : హీరో గోపీచంద్

'Viswam' Perfect Festival Movie : Hero Gopichand

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు. శ్రీనువైట్ల గారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏమిటి? – శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు…