vishvam movie review in telgugu : గోపీచంద్‌.. ‘విశ్వం’ లో కనిపించని కొత్తదనం

Movie Review: Srinuvaitla who does not come out of routine stories.. a novelty not seen in 'Viswam'

హీరో గోపీచంద్‌.. దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రమంలో… ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా ‘విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథేంటంటే.. జలాలుద్దీన్‌ ఖురేషి (జిషు సేన్‌) కరుడుగట్టిన ఐఎస్‌ఐ టెర్రరిస్ట్‌. సంజయ్‌ శర్మ అనే మారుపేరుతో భారత్‌లో నివసిస్తూ.. విద్యా వ్యవస్థ ముసుగులో విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. వాళ్ల సాయంతో పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించి భారత్‌ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తుంటాడు. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్‌) సోదరుడైన బాచిరాజు (సునీల్‌) సాయం తీసుకుంటాడు. కానీ, తన ఉగ్రచర్యల సంగతి సీతారామరాజుకు తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని జలాలుద్దీన్‌ కిరాతకంగా చంపేస్తాడు. ఈ హత్యను దర్శన అనే ఓ చిన్న పాప…