సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులెవరూ ఈ మధ్య కాలంలో తమ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘ఉప్పెన’తో వచ్చిన బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే..…