By ఎం.డి.అబ్దుల్/టాలీవుడ్ టైమ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా ‘వేట్టయన్: ద హంటర్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ‘జైలర్’ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రమిది. జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి…