తాజాగా ‘గాంఢీవదారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా కరుణకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. ‘మట్కా’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ జిమ్‌లో చెమటోడుస్తూ.. సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.…