దేశ రక్షణకు సంబంధించి పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఈ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవరా? అని అందరూ ఆలోచిస్తుంటే.. అంత హై రిస్క్ నుంచి కాపాడే ఏకైక వ్యక్తిగా అర్జున్ వారికి కనిపిస్తాడు. ఇంతకీ ఆ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏంటి? అర్జున్ ఎవరు? తనేం చేశాడు? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 25న రిలీజ్ అవుతున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా చూడాల్సిందేనంటున్నారు స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాంఢీవధారి అర్జున’. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌తో మెప్పించే వరుణ్ తేజ్ ఈసారి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించటానికి రెడీ అయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ లుక్…