‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం బిగ్ హిట్ అవ్వాలి

uttamavilan movie

ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ, సత్యా రెడ్డి, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు RGV చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, దర్శక,నిర్మాత సత్యా రెడ్డి, మాజీ ఎం. ఎల్. ఏ నగేష్ పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.…